డ్రాగన్ ఫ్రూట్

Updated: Mar 18, 2019


ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న అనేక ఆరోగ్య సమస్యలకు ఒక అద్భుతమైన దివ్యౌషధం ఈ డ్రాగన్ ఫ్రూట్.


ఈ డ్రాగన్ ఫ్రూట్ అమెరికా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది ఇది కాప్టర్ జాతికి చెందినటువంటి ఫలము.


ఇది చూడడానికి డ్రాగన్ లాగా కనిపిస్తుంది కాబట్టి దీనిని డ్రాగన్ ఫ్రూట్ అంటారు.


దీనిని పిటాయా లేదా స్ట్రాబెర్రీ పియర్ అంటారు


ఇది మూడు రకాలుగా మనకి లభిస్తుంది

1 ఇ పైన పింక్ కలర్తో లోపల తెల్లని pulp తో ఉంటుంది

2 పైన మరియు లోపల పింక్ కలర్ తోనే ఉంటుంది

3 పైన ఎల్లో కలర్ మరియు లోపల తెల్లని గుజ్జు తో ఉంటుంది
ఇందులో అనేక పోషకాలు ఉంటాయి ముఖ్యంగా C, బీ1, బీ2 విటమిన్లు తో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్, పాస్పరస్ వంటివి జీర్ణాశయ సంబంధిత సమస్యల ను నివారిస్తుంది. అలాగే మలబద్దకం ను కూడా తగ్గిస్తుంది.


ఇందులో ఉండే ఫైబర్స్ స్థాయిలు మధుమేహం ను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.


ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని బిగుతుగా ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి. అలాగే ఇవి కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి.


దీని గుజ్జును మరియు తేనెను కలిపి మాస్క్ గా వేసుకుంటే మొటిమలు కూడా తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.


ఇందులోని ఒమేగా3 ఫాటీ ఆసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్లు గుండె జబ్బులు నివారణకు ఉపయోగపడతాయి.


అలాగే రోజూ దీనిని తినడం వలన క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

ఈ రోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఊబకాయం. ప్రతిరోజూ ఒక డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఊబకాయం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.


ఈ పండు ప్రతి రోజూ తినడం వల్ల మనలో ఉన్న రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది అని వైద్యులు చెబుతున్నారు.


అలాగే ప్రస్తుతం మన దేశంలో విపరీతంగా వేధిస్తున్న డెంగ్యూ వ్యాధికి ఇది దివ్యౌషధం. ప్రతిరోజూ రెండు డ్రాగన్ ఫ్రూట్స్ తిన్నట్లయితే బ్లడ్ ప్లేటులెట్లు నార్మల్ కి వస్తాయని వైద్యులు చెబుతున్నారు.


ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ పండు కొంచెం ఖరీదు ఎక్కువైనప్పటికీ దీనిని మన డైలీ డైట్ లో చేర్చుకోవడం మూలంగా మన బరువు తగ్గడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.


మరెందుకు ఆలస్యం…? దీనిని వెంటనే మన డైట్ లో చేర్చు కొందామా….

30 views1 comment