జియో నుంచి సరికొత్త బ్రౌజర్టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు ఆప్స్ తయారు చేయడంలో కూడా ముందంజలో ఉంది.


రిలయన్స్ జియో నుంచి జియో బ్రౌజర్ విడుదలయ్యింది. రిలీజ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఫాస్ట్ అండ్ లైట్ అని తెలుస్తోంది


దీన్ని టెస్ట్ చేసినప్పుడు దాదాపుగా యూసీ బ్రౌజర్ ఎలా పని చేస్తుందో అలాగే పని చేస్తోంది.

డిజైన్ మరియు ఇంటర్ఫేస్ చాలా సింపుల్ గా ఉంది అందులోనూ దీని డౌన్లోడబుల్ సైజ్ కూడా చాలా తక్కువ. ఇది చాలా స్పీడ్ గా పని చేయడానికి ఒపేరాలో మాదిరి cache లేదు. ఇంకా ఇది 8 regional లాంగ్వేజెస్ ని సపోర్ట్ వస్తుంది ఇది సపోర్ట్ చేసే భాషలు తెలుగు, తమిళం, కన్నడ ,హిందీ , బెంగాలీ, మరాఠీ, గుజరాతీ మరియు మలయాళం.


మరొక ముఖ్య విశేషమేమిటంటే ఇందులో డౌన్లోడ్ మేనేజర్ సపరేట్ గా ఉంది. ఇందులో download speeds కూడా బావున్నాయి.

ఇందులో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇది బ్రౌజర్ యొక్క భాష నే కాదు ఒకసారి మనం సెలెక్ట్ చేసుకున్న భాష న్యూస్ ఫీడ్ కూడా చూపించడం అంటే ఆటోమేటిక్ గా browse చేసేటటువంటి విషయాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకున్న భాషలోకి మార్చి చూపించడం దీని ప్రత్యేకత.

ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని బ్రౌజర్ ల మాదిరిగానే ఇందులోనూ సెర్చ్ బార్ పైన పెద్దగా ఉంది. అదేవిధంగా హోమ్ పేజీలో మై జియో అమెజాన్ NDTV ఫ్లిప్కార్ట్ వంటివి ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఫేవరెట్ లలో ఉన్నాయి


ప్రస్తుతానికి ఇది మొదటి వెర్షన్ కాబట్టి ఇంకా ఇంప్రూవ్ కావాల్సింది చాలా ఉంది. ఆండ్రాయిడ్ 5 పైన ఉన్న అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ని ఇది సపోర్ట్ చేస్తుంది.


గూగుల్ ప్లే ద్వారా కింది లింకులో బ్రౌజర్ని పొందవచ్చు


https://play.google.com/store/apps/details?id=com.jio.web&hl=en

63 views0 comments