
Mi Power Bank 3 Pro వచ్చేసింది..!

షామి అనేది చైనాలో పుట్టిన ఒక చిన్న బ్రాండ్. కానీ ఇంతింతై వటుడింతై అన్నట్టు చైనాలోనే కాకుండా భారతదేశంలో అన్ని బ్రాండ్లను వెనక్కి తోసి దాదాపుగా స్మార్ట్ఫోన్ రంగం లో నెంబర్ వన్ గా నిలదొక్కుకుంది
షామీ సంస్థ స్మార్ట్ఫోన్లతో పాటు అనేక ఇతర యాక్సెసరీ లను కూడా విడుదల చేస్తుంది. ఇది కూడా స్మార్ట్ఫోన్లతో పాటు గా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
షామీ సంస్థ ఇప్పటికే విడుదల చేసిన పవర్ బ్యాంకు లను అనేక మంది వినియోగదారులు వాడుతున్నారు. దాదాపుగా పవర్ బ్యాంకు ఆల్టర్నేటివ్ గా షామీ పవర్ బ్యాంకు పేరు పొందింది

ఇప్పుడు ఎమ్ఐ పవర్ బ్యాంక్ 3 pro మార్కెట్లోకి వచ్చేసింది. దాని స్పెసిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాం
- దీని డిజైను దాదాపు దీనికి ముందు వచ్చిన Mi 2I పవర్ బ్యాంకు లాగానే ఉంటుంది .
- ఇది 20000 mah కెపాసిటీని కలిగి ఉంది.
-ఇది usb type c port ను కూడా కలిగి ఉంది
.
- అలాగే ఇందులో 2వే చార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
- ఇది ఓల్డేజి హెచ్చుతగ్గులు, షార్ట్ సర్క్యూట్ ,ఓవర్ చార్జింగ్ వంటి తొమ్మిది రకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా తయారు చేయబడింది.
- ఇది సాధారణ 10W చార్జర్ తో ఛార్జ్ చేస్తే 11 గంటల్లో హండ్రెడ్ పర్సెంట్ ఛార్జి అవుతుంది. దీనితో పాటు వచ్చే 25W చార్జర్ తో ఛార్జ్ చేస్తే 4 గంటల్లో హండ్రెడ్ పర్సెంట్ ఛార్జి అవుతుంది.
- దీనితో కొన్ని రకాల లాప్టాప్ లను చార్జి చేసుకునే అవకాశం ఉంది .
ఇది ప్రస్తుతం చైనా లోని TMall ద్వారా మాత్రమే లభిస్తుంది
దీని ధర దాదాపు మన భారతీయ కరెన్సీ ప్రకారం రెండు వేల రూపాయలు.
మనదేశంలో అతి త్వరలో ఇది లభిస్తుందని ఆశిద్దాం.