UIDAI నెంబర్ ఉంటే ఫోన్ హ్యాక్ అవుతుందా


ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ వాట్సప్ లోనూ ఫేస్ బుక్ లోనూ వైరల్ గా మారింది అదేంటంటే ఆధార్ కార్డు హెల్ప్ లైన్ నెంబర్ మన ఫోన్ లో చేరి అది మన ఫోన్ ని హాక్ చేస్తోందని ఒక పుకారు

హల్చల్ చేస్తుంది

ఇది పూర్తిగా అబద్ధం ఎందుకంటే కేవలం ఒక ఫోన్ నెంబర్ ఉండడం వల్ల మన ఫోను ఎప్పుడు హ్యాక్ కాదు. కానీ ఈ పుకార్లు నిజమో కాదో నిర్ధారించుకోకుండా అందరికీ మనం సెండ్ చేయడం అలవాటు అయిపోయింది.

ఆన్నంత ఇది దాదాపు ఒక సంవత్సరము కిందట పుకారు షికారు చేసింది అయితే చాలామంది టెక్నాలజీ రంగ నిపుణులు దీనిని ఖండించి ఇది ఏ విధంగానూ సరైనది కాదు అని నిరూపించిన తర్వాత సద్దుమనిగింది మళ్లీ ఇప్పుడు బయటకు వచ్చిందిమనము ఎలాంటి లాజిక్ ఆలోచించకుండా దీనిని నమ్మడం అనేది ఎంత అవివేకం అంటే మన ఇంట్లో ఒక వస్తువు ఉండటంవల్ల మన బ్యాం కు లాకర్ హ్యాక్ అవుతుంది అననం త హాస్యాస్పదం. చాలామంది మన ఫ్రెండ్స్ కూడా దీనిని షేర్ చేస్తూనే ఉన్నారు

కానీ మీరు ఒకటి గమనించండి మనం ఏ ఫోన్ ఉన్నప్పటికీ అందులో కొన్ని అత్యవసర మైనటువంటి నెంబర్లు అంటే పోలీసు 108 ఇలాంటి నెంబర్ లు అన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చి ఉంటాయి అదేవిధంగా నెట్వర్కు సంబంధించి సపోర్ట్ నెంబర్స్ హెల్ప్లైన్ నెంబర్లు కూడా ఉంటాయి అదేవిధంగా మనం కున్నటువంటి sim కూడా కొన్ని నెంబర్లను తీసుకొస్తుంది అంటే కస్టమర్ కేర్ నెంబర్ మరి కొన్ని నెంబర్లు.

అదేవిధంగా ఆధార్తో అనుసంధానం కావలసినటువంటి పరిస్థితులను గమనించిన ప్రభుత్వం గూగుల్ సంస్థ ఈ నెంబర్ ని తన సాఫ్ట్వేర్లో include చేయవలసిందిగా కోరింది అందువల్ల గూగుల్ తన సాఫ్ట్వేర్ లో దానిని పొందుపరిచింది అంతే కానీ ఈ నెంబర్ ఉండడం వల్ల మన ఫోన్ కి వచ్చే ప్రమాదమేమీ లేదు

మనము అసలు విషయాన్ని పట్టించుకోకుండా ఎవరో చెప్పినటువంటి అబద్ధాన్ని పుకార్లని అలాగే షేర్ చేయడం సమాజానికి మంచిది కాదు దయచేసి ముఖ్య మైనటువంటి విషయాలను తెలుసుకోవడం మంచిది ఎందుకంటే బేసిక్స్ కూడా తెలియకుండా మనం ఎంత ఖరీదైన ఫోన్ వాడిన మనం షేర్ చేసేటటువంటి కంటెంట్ ను బట్టి మనల్ని అవతలి వారు ఒక అంచనా వేస్తారు.

దయచేసి ఈ విషయాన్ని మీరు షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను