శ్రీ వెంకటేశ్వర ద్వాదశ నామ స్త్రోత్రము

శ్రీ వెంకటేశ్వర ద్వాదశ నామ స్త్రోత్రము మహా మహిమాన్వితమైనది. దీనిని ఎవరైతే త్రిసంధ్యలలో పఠిస్తారో వారి పాపాలు తొలిగి విష్ణుపదం చేరుతారని అలాగే ఇహలోకంలో ఎన్నికష్టాలు తీరుతాయని విశ్వాసం. ఇది బ్రహ్మాండ పురాణం లోని స్త్రోత్రము.

దీనిని బ్రహ్మ దేవుడు నారద మహర్షికి ఉపదేశించాడుఅస్య శ్రీ వేంకటేశ ద్వాదశనామ స్తోత్ర మహామంత్రస్య

బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ వేంకటేశ్వరో దేవతా ఇష్టార్థే వినియోగః |


నారాయణో జగన్నాథో వారిజాసనవందితః | స్వామిపుష్కరిణీవాసీ శంఖచక్రగదాధరః || ౧ ||

పీతాంబరధరో దేవో గరుడాసనశోభితః | కందర్పకోటిలావణ్యః కమలాయతలోచనః || ౨ ||


ఇందిరాపతిగోవిందః చంద్రసూర్యప్రభాకరః | విశ్వాత్మా విశ్వలోకేశో జయ శ్రీవేంకటేశ్వరః || ౩ ||

ఏతద్ద్వాదశనామాని త్రిసంధ్యం యః పఠేన్నరః | దారిద్ర్యదుఃఖనిర్ముక్తో ధనధాన్యసమృద్ధిమాన్ || ౪ ||

జనవశ్యం రాజవశ్యం సర్వకామార్థసిద్ధిదమ్ | దివ్యతేజః సమాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతి || ౫ ||

గ్రహరోగాదినాశం చ కామితార్థఫలప్రదమ్ | ఇహ జన్మని సౌఖ్యం చ విష్ణు సాయుజ్యమాప్నుయాత్ || ౬ ||

ఇతి బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే శ్రీ వేంకటేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణం ||334 views0 comments