వాట్సాప్ గోల్డ్ వైరస్ మళ్లీ వచ్చింది


గత కొద్దిరోజులుగా వాట్సాప్ గోల్డ్ లేదా వాట్సాప్ కలర్ అనేటటువంటి ఒక వైరస్ వాట్సాప్ యూజర్లను ముప్పు తిప్పలు పెడుతుంది. చాలామంది తెలిసీ తెలియక దాని బారిన పడుతున్నారు.


ఒక రెండు సంవత్సరాల కిందట అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ తో వాట్సప్ గోల్డ్ అనే ఒక లింక్ చాలా మొబైల్స్ ని వైరస్ తో నింపేసింది. తరువాత దానిని నిరోధించడంలో వాట్సాప్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దాదాపుగా దానిని నిరోధిం చడం జరిగింది.


అయితే అనేక పుకార్లు విచ్చలవిడిగా షేర్ కావడం, వాటి బారిన పడి అనేకమంది ప్రాణాలు కోల్పోవడంతో భారత ప్రభుత్వం వాట్సాప్కి దీనిని ఎలాగైనా ఆపాల్సిందిగా మరియు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. దాంతో వాట్సాప్ మెసేజ్ ని ఐదు మంది కంటే ఎక్కువ మందికి షేర్ చేయడానికి వీలులేకుండా సాఫ్ట్వేర్ ని మార్చింది.


సరిగ్గా దీనిని అవకాశంగా తీసుకుని ఈ వాట్సప్ గోల్డ్ వైరస్ మన ఫోన్లలో సర్క్యులేట్ అవుతోంది వాట్సప్ గోల్డ్ అనేది ఒక ప్రత్యేకమైన అప్డేట్ అని దీనిని డౌన్లోడ్ చేసుకుంటే ఎలాంటి పరిమితులు లేకుండా కావలసినంత మంది కి మెసేజ్ ఫార్వర్డ్ చేసుకోవచ్చని ఇంకా అనేక కొత్త సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయని మనకు ఒక లింకుతో మెసేజ్ వస్తుంది.పొరపాటున ఆ లింక్ ని క్లిక్ చేసి లేదా ఓపెన్ చేసినట్టయితే ఇక మనం ఆ వైరస్ బారిన పడినట్టే.


కాబట్టి వాట్సప్ గోల్డ్ అనే పేరుతో ఎలాంటి మెసేజ్ వచ్చిన దానిని ఓపెన్ చేయకండి


ఇక వాట్సాప్ విషయానికి వస్తే వాట్సప్ కేవలం మూడు వెర్షన్లలో మాత్రమే దొరుకుతుంది అవి

1.వాట్సాప్

2.వాట్సాప్ బిజినెస్

3.వాట్సాప్ బీటా వెర్షన్


అంతేగాని ఇంకేలాంటి కొత్త వెర్షన్ అందుబాటులో లేదు


అయితే ఇంటర్ నెట్ లో కొన్ని వాట్స్అప్ mod app లు లభ్యమవుతున్నాయి వీటివల్ల ఎలాంటి ప్రమాదం ఉందో ఇంకా తెలియలేదు కాబట్టి అఫీషియల్ వాట్సాప్ ను మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకుందాం

57 views0 comments